తెలంగాణ
Road Accident: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

Road Accident: ఖమ్మం జిల్లా కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ పక్కానే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు గోపాలకృష్ణ , ఉపేందర్‌గా గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.



