జాతియం
దళపతి విజయ్ టీవీకే పార్టీ సభలో అపశృతి..

తమిళనాడులో దళపతి విజయ్ టీవీకే పార్టీ సభలో అపశృతి చోటుచేసుకుంది. మధురైలో భారీ బహిరంగసభలో ఒకరు మృతి చెందారు. 400 మంది అస్వస్థతకు గురయ్యారు. టీవీకే సభకు హాజరైన నాలుగు లక్షల మంది హాజరుకావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విజయ్‌తో షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం వరుస సభలు పెడుతున్న విజయ్ నేడు మధురైలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతీ సభకూ భారీగా తరలివస్తున్న పార్టీ అభిమానులు, ఫ్యాన్స్‌ను కట్టడి చేయడం ఇబ్బందిగా మారుతోంది. మధురై సభలో టీవీకే కార్యకర్త మృతికి విజయ్ సంతాపం ప్రకటించారు.



