తెలంగాణ
Revanth Reddy: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి

Revanth Reddy: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు.
అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి పర్యవేక్షించాలని కోరారు. క్షతగాత్రులకు తగిన వైద్యం అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం అదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారందరినీ కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని.. హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.



