తెలంగాణ
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుంటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన ప్రభుత్వం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు.
అలాగే, ప్రమాదంలో గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.



