తెలంగాణ
ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలు

కళాశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. జూలూరుపాడులోని సాధన జూనియర్ కళాశాలకు విద్యార్థులను తీసుకుని వెళ్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థులను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు స్థానికులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



