ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: పెన్షన్లు తొలగిస్తున్నారనే వైసీపీ ప్రచారాన్ని నమ్మొద్దు

Kollu Ravindra: పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులు ప్రశాంతంగా జీవించాలనే కూటమి ప్రభుత్వం వారి పెన్షన్లను రెట్టింపు చేసి పంపిణీ చేస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు ధృవపత్రాలతో పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. బందరు మండలం పోతేపల్లి గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.



