ఆంధ్ర ప్రదేశ్
కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైసీపీ ఎమ్మెల్సీ.. శాసన మండలిలో గందరగోళం

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. సూపర్ 6 పథకాలపై మండలిలో చర్చ జరిగింది. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంబోధించారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. రమేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు.
సీఎంను కుప్పం ఎమ్మెల్యే అన్న రమేష్ క్షమాపణ చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ని పులివెందుల పులకేశి అంటే ఒప్పుకుంటారా..? అని రాంప్రసాద్ ప్రశ్నించారు. వీరికి వైసీపీ నేత బొత్స కౌంటర్ ఇచ్చారు. జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అనడం లేదా? అని ప్రశ్నించారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలన్నారు బొత్స సత్యనారాయణ.



