ఆంధ్ర ప్రదేశ్
ఎగువ అహోబిలం లో విరిగిపడ్డ కొండచరియలు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణంలో ఉన్న నిత్య అన్నదాన సత్రం షెడ్డుపైన కరెంటు స్తంభం పడడంతో రేకులన్నీ తునాతునకలయ్యాయి. భక్తులు,పర్యాటకులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన ఎలక్ట్రికల్ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.



