తెలంగాణ
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదైంది. పోలింగ్ సిబ్బంది, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ అభ్యర్థిని బయటకు ఎలా పంపారని అటు సిబ్బందిని, ఇటు పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు.
హరిచరణ్ మార్వాడి స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎలక్షన్ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరవింద్‌పై కేసు నమోదైంది. ఎలక్షన్ బూత్ లోకి నిషేధిత స్టిల్ కెమెరా, వీడియో కెమెరాలతో వెళ్లి డ్యూటీ లో ఉన్న పోలింగ్ సిబ్బందిని ఎంపీ అరవింద్ బెదిరించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.



