ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలోని శివాలయాలకు క్యూ కట్టిన భక్తులు

కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తిరుపతి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, శివుడిని ఆరాధిస్తూ దీపారాధన చేస్తున్నారు. అలాగే కపిలేశ్వరస్వామి ఆలయ ఆవరణలోఉసిరి, నిమ్మ, పిండి దీపాలను వెలిగించి బిల్వ పత్రులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.



