తెలంగాణ
Talasani: కార్పొరేటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటు

Talasani: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అరెస్టైన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు రాంగోపాల్‌పేట్ పీఎస్‌కు తరలించారు. కార్పొరేటర్లకు బీఆర్ఎస్ నగర ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. మేయర్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు.