ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదు..రైతులతో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: కొబ్బరి రైతులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వరాలు ఇవ్వడానికి తను ముఖ్యమంత్రి స్థానంలో లేనన్నారు. మీకు ఏది కావాలన్నా సీఎంను అడగాలన్నారు. మీకు ఇచ్చేంత బడ్జెట్ తన దగ్గర ఉండదన్న పవన్.. ఉన్న డబ్బంతా పథకాలను ఖర్చు చేసేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసిందన్నారు పవన్.



