తెలంగాణ
Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీ హెల్త్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ తీర్పు

Vallabhaneni Vamshi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హెల్త్, కస్టడీ పిటిషన్లపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ రెండు పిటిషన్లపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.
హెల్త్ పిటిషన్‌పై వాదనలు సందర్భంగా వంశీని ప్రత్యేక సెల్‌లో ఎందుకు ఉంచారని కోర్టు ప్రశ్నించింది. జైల్లో బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ భద్రత రీత్యా ఆయనను ప్రత్యేక సెల్‌లో ఉంచామని జైలు సూపరింటెండెంట్ పాల్ కోర్టుకు తెలిపారు.