తెలంగాణ
DK Aruna: పేద ముస్లింలకు లబ్ధి చేకూరడమే వక్ఫ్ చట్టం లక్ష్యం

DK Aruna: వక్ఫ్‌పై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చట్టం తెచ్చినట్లు తెలంగాణ బీజేపీ నేత, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల్లో జేపీసీ పర్యటించిందని తెలిపారు. పేద ముస్లింలకు లబ్ధి చేకూరడమే వక్ఫ్ చట్టం లక్ష్యమన్నారు. కొందరు కావాలనే వక్ఫ్‌పై అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కొందరి చేతుల్లోనే వక్ఫ్ భూములు ఉన్నాయని అవన్నీ దేశంలోని ముస్లింలందరికీ దక్కాలని ఆకాంక్షించారు. రోజురోజుకూ దేశంలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోందన్నారు డీకే అరుణ. ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందుతోందని విమర్శించారు. వక్ఫ్ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ఆ బాధ్యత తమదే అని డీకే అరుణ తెలిపారు.



