తెలంగాణ
KTR: ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టుడా..?

KTR: మూసీ పేరుతో హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టుడా అని ప్రశ్నించారు. హైడ్రా ఇళ్లు కూలగొట్టడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు.
ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలు కావాలన్నారు.



