CMR Collage: బాత్రూమ్ లో వీడియోలు తీశారంటూ.. మేడ్చల్ సీఎంఆర్ విద్యార్థినుల ఆందోళన..

CMR Collage: మేడ్చల్, కండ్లకోయ CMR ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం. విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లలో ఫోన్ ల ద్వార వీడియోల రికార్డింగ్. దాదాపు 300 ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు సమాచారం. 3 నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికి దానిని బయటకు రాకుండా గోప్యంగా ఉంచిన యాజమాన్యం. విద్యార్థినిలు ప్రశ్నిస్తే మీ వీడియోలు కూడా బయటపెడతామని విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేస్తున్న యజమాన్యం. రికార్డ్ అయిన వీడియోలు ఉంచుకొని విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేస్తున్న యాజమాన్యం.
ఇప్పటికే అనేక మంది విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీస విచారణ చేపట్టని ప్రభుత్వం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులైన యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ABVP ధర్నా. విద్యార్థినిలను బ్లాక్ మెయిల్ కు గురి చేస్తున్న సీఎంఆర్ కళాశాలని సీజ్ చేసి విద్యార్థినులను రక్షించాలని డిమాండ్.