తెలంగాణ
Bandi Sanjay: కృష్ణా జలాలపై గత ప్రభుత్వ వైఫల్యం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కృష్ణా జలాలను గత ప్రభుత్వం సద్వినియోగం చేయలేదని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు. దాదాపు 60 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పు తెలిసినా, బీఆర్ఎస్ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో వాటా ప్రకారం తెలంగాణకు 571 టీఎంసీలు, ఏపీకి 299 టీఎంసీలు రావాలని తెలిపారు.
కానీ వాస్తవంగా ఈ వాటాలు రివర్స్ అయ్యాయని అన్నారు. ఉమాభారతి సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్, హరీష్ మధ్య ఒప్పందం జరిగిందని, ఈ ఒప్పందాన్ని మొదటిసారిగా తానే బయటపెట్టానని చెప్పారు. నీళ్ల విషయంలో మొదటి నుంచీ పోరాడింది బీజేపీనేనని, కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎప్పుడూ పోరాటం చేయలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.



