క్రీడలు
క్రికెటర్ శ్రీచరణికి గన్నవరంలో ఘన స్వాగతం

భారత్ మహిళా క్రికెటర్ శ్రీచరణికి కృష్ణ జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది.
హొం మంత్రి అనిత సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికారు. ఇటీవల ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ను చిత్తుగా ఓడించి భరత్‌కు మరిచిపోలేని విజయం అందించింది మహిళా క్రికెట్ టీం. ఇక గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరిన శ్రీచరణి సీఎం చంద్రబాబును కలవనున్నారు.



