ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భారీ రేషన్ కుంభకోణం

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భారీ రేషన్ కుంభకోణం వెలుగు చూసింది. దాదాపు 4 వేల బస్తాల రేషన్ బియ్యం మాయం కావడంతో పౌర సరఫరాల శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలోనే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సంబంధిత అధికారులు.
సుమారు కోటి రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఉన్నతాధికారుల నెలవారి తనిఖీల్లో రేషన్ షాపులకు క్లీన్ చీట్ ఇవ్వడం.. ఇప్పుడు పెద్ద మొత్తంలో బియ్యాన్ని మింగేయడం, డబ్బులు చేతులు మారడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.



