తెలంగాణ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ములుగు ఎస్సై

Siddipet: 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకీ పట్టుబడిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. డబుల్ బెడ్రూం విషయంలో ఓ మహిళ వద్ద నుంచి ములుగు ఎస్సై విజయ్ కుమార్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అధికారులు.
బాధితులకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంటిని కబ్జా చేయడంతో ఎస్సైను ఆశ్రయించగా 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఎస్సైకి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.



