తెలంగాణ
రాహుల్, రేవంత్ గాలిపటాలు తయారు చేయించిన మెట్టు సాయి

కాంగ్రెస్‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్. సంక్రాంతి పండగ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫొటోలతో కూడిన ప్రత్యేక గాలిపటాలను తయారు చేయించారు సాయి కుమార్.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందించి ఈ గాలిపటాలు ఆకట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సాయి కుమార్ తెలిపారు.



