Pawan Kalyan: నాకు డబ్బులు అవసరమైనంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటా

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా తన సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నారు. వీలైనంత త్వరగా తన సినిమాలను పూర్తి చేసేపనిలో ఉన్నారు.
అయితే ఈ సినిమాల తర్వాత పవన్ సినిమా రంగంలో కొనసాగుతారా? లేదా సినిమాలకు గుడ్ బయ్ చెప్పి తన పూర్తి సమయాన్ని ప్రజాసేవకు కేటాయిస్తారా? అనే సందేహం చాలా మంది అభిమానుల్లో ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. డబ్బు అవసరం ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటానని అన్నారు. ”నేను నిస్వార్థంగా సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటాను.
నేను ఎలాంటి సంపద కూడబెట్టలేదు, నాకు వ్యాపారాలు కూడా లేవు. నాకు ఉన్న ఒకే ఆదాయమార్గం నటనే. సినిమాలు చేస్తున్నంతవరకు వాటికి న్యాయం చేయాలి. అలాగే నాకు డబ్బు అవసరమున్నంత వరకు నటిస్తూనే ఉంటాను. అదేవిధంగా పరిపాలనకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను” అని క్లారిటీ ఇచ్చారు పవర్ స్టార్. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.



