మంచానికే పరిమితమైన బాలికకు జగ్గారెడ్డి సాయం

Jagga Reddy: 9 ఏళ్లుగా తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైన బాలిక ధీనగాథ గురించి తెలుసుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూడు లక్షల రూపాయల ఆర్థికసాయం చేశారు. కార్పొరేట్ వైద్యం చేయించి బాలిక మళ్లీ నడిచేలా చేసేందుకు కావాల్సిన మరింత ఆర్థిక సాయాన్నిఅందిస్తానని మాటిచ్చారు. అవసరమైతే సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి పాపకు ఉచిత వైద్యం చేయించేందుకు ఏర్పాటు చేస్తానని కూడా తెలిపారు. బాలిక తండ్రి మహేష్ పేదరికం కారణంగా చికిత్స చేయించలేకపోతున్నానని దాతల కోసం గాంధీభవన్ మీడియాకు చెప్పడంతో వారు సమాచారాన్ని జగ్గారెడ్డికి తెలిపారు.
పాప తండ్రిని ఆర్తిక సాయం చేసిన జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సుష్మ అనుకోకుండా చీమలమందు కలిపిన చపాతీపిండిని తిని అస్వస్థతకు గురై మంచానికే పరిమితం కావాల్సివచ్చింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన బాలికకు తల్లిదండ్రులు ఉన్నంతలో చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. మరిన్ని వైద్య ఖర్చుల నిమిత్తం దాతల కోసం సంప్రదిస్తున్నారు. ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు తండ్రి మహేష్ సెల్ నెంబర్ 9553461480 కాంట్రాక్టు చేయాలని కోరారు.



