తెలంగాణ
Jagga Reddy: బైక్ పై భార్య తో జగ్గారెడ్డి షికారు

Jagga Reddy: సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న చెరువులను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2500 కోట్లు నిధులు మంజూరు కానున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని 15 చెరువులను బైక్‌పై 30 కిలోమీటర్ల మేర పర్యటిస్తూ పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు 15 చెరువులను పరిశీలించి, సుందరీకరణకు తగు సూచనలు ఇచ్చారు.
ప్రతి చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, నెక్లెస్ రోడ్డు, బోటింగ్, పార్కులతో పాటు బతుకమ్మ, వినాయక నిమజ్జనం ఘాట్‌లను నిర్మించాలని ఆయన సూచించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే సంగారెడ్డి పట్టణం పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.



