తెలంగాణ
జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం

హైదరాబాద్ నగర శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. 27 నగరపాలక సంస్థలను డీనోటిఫై చేసి గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ జీహెచ్ఎంసీ చట్టాలను సవరించనుంది ప్రభుత్వం.
ఈ మేరకు మున్సిపల్ శాఖ రెండు ముసాయిదా బిల్లులను రూపొందించి గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. ఆ ఫైల్ ఇవాళ గవర్నర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ వీలనంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.



