ఆంధ్ర ప్రదేశ్

Narayana: చదువుతోనే సమాజంలో గౌరవం

Narayana: చదువే సమాజంలో అందరికీ గౌరవం పెంచుతుందని ఆ చదువు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి నగర్ ప్రాంతంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే తన లక్ష్యం నెరవేరుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. నెల్లూరు నగరంలో సుమారు 200 కోట్ల రూపాయలతో పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button