ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిలో భారీ వర్షాలు..!

తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో కైవల్యానదిలోకి వరదనీరు చేరుతుండగా, మండలంలోని పలు చెరువులు కూడా జలకళను సంతరించుకుంటున్నాయి.

వర్షాలతో పట్టణం, పరిసర గ్రామాల్లో వాతావరణం చల్లబడింది. చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, చెరువుల సమీపంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button