ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు బస్సు ప్రమాదం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Ponnam Prabhakar: కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సులపై రోజువారి రవాణా శాఖ చెక్ చేస్తే వేధింపులు అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎలాంటి ఘటనలు జరుగుతుంటే ఎవరు బాధ్యులుగా ఉంటారని ఆయన ప్రశ్నించారు.
ఇకపై ఎవరు నిర్లక్ష్యంగా ఉన్న చూస్తూ ఊరుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. త్వరలో ఆంధ్రా, కర్ణాటక మంత్రులు కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిందన్నారు.



