తెలంగాణ
మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు

మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎర్రవల్లిలోని ఫామహౌస్కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. అనంతరం, కేసీఆర్ దంపతులు కూడా మంత్రులను సన్మానించారు.
ఆహ్వానం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మేడారంలో జాతర సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను కేసీఆర్కు వివరించినట్టుగా తెలిసింది. అనంతరం, మేడారం జాతరకు ఏదోఒక రోజు తాము హాజరు అవుతామని కేసీఆర్ చెప్పారని మంత్రులు వెల్లడించారు. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లిపోయారు.



