తెలంగాణ
KTR: 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచింది

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే రాజేంద్రనగర్, చేవెళ్లకి ఉపఎన్నికలు వస్తాయన్నారు ఆయన. అంతేకాదు రాజేంద్రనగర్ బైపోల్‌లో కార్తీక్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచిందని కానీ, ఇప్పటివరకు ఒక్క మంచి పని కూడా చేసింది లేదన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప, కాంగ్రెస్ నేతలకు ఏం చేతకాదన్నారు కేటీఆర్.



