Revanth Reddy: 18 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ సీరియస్!

Revanth Reddy: తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. సాధించిన ఫలితాలు, ఓడిపోయిన స్థానాలపై చర్చించారు. ఈ సందర్భంగా 18 మంది ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్త చేశారు. బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారని సీరియస్ అయ్యారు. ఇక పార్టీ రెబల్స్ బరిలోకి దిగితే వారిని బుజ్జగించకపోవడం ఏంటని ఇంచార్జ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు పీసీసీ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
కాగా ఈ నెల 11, 14, 17 తేదీలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పల్లెజనం అధికార కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. మూడు విడతల్లో కలిపి కాంగ్రెస్ 7491 స్థానాలు, బీఆర్ఎస్ 3,494, 749 బీజేపీ, ఇతరులు 956 చోట్ల విజయం సాధించారు. ఈ ఫలితాల్లో అధికార పార్టీకి మూడింట రెండొంతుల సీట్లు దక్కించుకోగా మూడింట ఒకటో వంతు బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.



