‘జై హనుమాన్’ నుంచి తేజ సజ్జా ఔట్?

‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’పై కొత్త రూమర్ వైరల్ అవుతోంది. హీరో తేజ సజ్జా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో తేజ రోల్ పరిమితంగా ఉండటమే కారణమని తెలుస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
‘హనుమాన్’ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ అనౌన్స్ అయింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆలస్యమైంది.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో నటిస్తున్నారు. తేజ సజ్జా కూడా కీలక పాత్ర పోషిస్తారని ముందు నుంచి చెబుతున్నారు. అయితే ఇటీవల తేజ సజ్జ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే రూమర్ బలంగా వ్యాప్తి చెందింది. తన రోల్ పరిమితంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కొన్ని వర్గాలు చర్చిస్తున్నాయి. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ ‘మిరాయ్’తో మరో బ్లాక్‌బస్టర్ అందించారు. ప్రస్తుతం జాంబీ రెడ్డి సీక్వెల్‌పై దృష్టి పెట్టారు. మేకర్స్ నుంచి రూమర్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.



