తెలంగాణ

Hanumakonda: విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్

Hanumakonda: ఓ విద్యార్థిని టీచర్ చితకబాదడంతో విద్యార్థిని చేయి విరిగింది. ఈ సంఘటన హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పరకాలకు చెందిన నివేదిత ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే గురుకల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ టీచర్ నివేదితను చితకాబాదడంతో చేయి విరిగింది.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత, శారీరక మానసిక సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని బాధిత తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button