తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. దోసెలు వేసిన మంత్రులు పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా హైదరాబాద్‌ యూసఫ్ గూడ డివిజన్‌‌లోని కృష్ణ నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో భాగంగా ఓ హోటల్‌లో దోశ వేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.

అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అభిృద్ధి పనులు చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button