తెలంగాణ
Jagdeep Dhankar: నేడు సంగారెడ్డిలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ పర్యటన

Jagdeep Dhankar: నేడు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్ కడ్ తెలంగాణలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ను జగదీప్ థన్ కడ్ సందర్శించనున్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత ఉప రాష్ట్రపతి వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనంతరం భారత ఉప రాష్ట్రపతి సంగారెడ్డి నుంచినేరుగా హైదరాబాద్ చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు తెలంగాణ గవర్నర్ కూడా పాల్గొననున్నారు. సంగారెడ్డికి వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.