ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో నడి రోడ్డుపై నిప్పంటిచుకున్న వ్యక్తి

విశాఖ ఆరిలోవలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిప్పంటిచుకున్నాడు. ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండగానే తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాత్నం చేశాడు. స్థానికులు మంటలను అదుపు చేశారు. వెంటనే పోలీసులకు, 108కి సమాచారం అందిచారు.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతడిని 108లో KGHకి తరలించారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



