తెలంగాణ
నువ్వే లిక్కర్ రాణి.. కవితపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఫైర్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకుండా తనపై దుర్భాషలాడడం ఎంత వరకు సమంజసమన్నారు. తాను ఒక్కసారి కూడా కవితపై పల్లెత్తు మాట అనలేదని తెలిపారు.
కష్ట సమయంలో పార్టీ జెండాను, కేసీఆర్ వదిలిపెట్టాలేదని నిరంజన్‌రెడ్డి అన్నారు. తాను కావాలని నీళ్ల నిరంజన్‌రెడ్డి అని పిలిపించుకోలేదన్నారు. నీవే లిక్కర్ రాణి అని పిలిపించుకో అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత కేసీఆర్‌ను మనసికంగా వేధిస్తుందని ఆయన విమర్శించారు.



