భారత్‌పై సుంకాల భారం.. అమెరికాకే ఎదురుదెబ్బ

భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికే పెనుభారంగా మారుతోంది. భారత వస్తువులపై అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్థిక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ చర్యల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, వృద్ధి రేటు పడిపోతుందని ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో స్పష్టం చేసింది.
భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక వస్తువులపై బుధవారం నుంచి అదనంగా 25 శాతం సుంకాలను అమెరికా అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఉన్న సుంకాలకు ఇది అదనం. రష్యా ప్రభుత్వం నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందన్నకారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీహెచ్ఎస్ ఓ ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది.
ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి కొన్ని వస్తువులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.ఈ సుంకాల ప్రభావం అమెరికా జీడీపీపై 40 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. సుంకాల కారణంగా దిగుమతుల ధరలు పెరిగి, డాలర్ బలహీనపడుతుందని నివేదిక వివరించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, గృహోపకరణాల వంటి రంగాలలో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.



