సినిమా
దేవర 2 ఆగిపోయిందా?

Devara 2: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అనూహ్య అప్‌డేట్! ‘దేవర’ సక్సెస్ తర్వాత సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ, ‘దేవర 2’ను ఎన్టీఆర్ పక్కన పడేస్తున్నారా? కొరటాల స్క్రిప్ట్ సిద్ధమైనా కథ క్యాన్సిల్ అయ్యిందా? అసలు కథ ఏంటో తెలుసుకుందాం.
‘దేవర’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తర్వాత, అభిమానులు ‘దేవర 2’ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినప్పటికీ, ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ పూర్తి చేసిన తర్వాత, త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్‌లతో కొత్త చిత్రాలు ప్లాన్‌లో ఉన్నాయి.
ఈ షెడ్యూల్ కారణంగా ‘దేవర 2’ ఆలస్యం కావచ్చు. ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక వ్యూహం ఏమిటి? అనేది అభిమానులకు అర్థం కానీ ప్రశ్నగా మిగిలింది. మొత్తానికి ఈ వార్తతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.



