తెలంగాణ
Cyclone Montha: రైతులకు తీరని నష్టం మిగిల్చిన మొంథా తుఫాన్

Cyclone Montha: మొంథా తుఫాన్ అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పల్లె నిజామాబాద్ గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తున్నారు.
ఎంతో శ్రమించి అప్పులు చేసి పండించిన వరి పంట తుఫాను ధాటికి పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కష్టపడి, పెట్టుబడి పెట్టి పండించిన పంట మొత్తం ఒక్క రాత్రి వర్షానికే నాశనమైంది. మా కష్టం అంతా వృథా అయ్యింది అంటూ రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.



