తెలంగాణ
కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై స్పందించిన మంత్రి సీతక్క

Seethakka: కామారెడ్డి జిల్లా రామారెడ్డి పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై మంత్రి సీతక్క స్పందించారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడుతో పాటు మరో ఇద్దరు తాగిన వ్యక్తులు వచ్చి కాన్వాయ్ అడ్డుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. తాగి వచ్చిన వారు కాన్వాయ్ కింద పడి చనిపోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
దీనికి తాను సమాధానం చెప్తుంటే పారిపోయామని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రాసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకున్న వారిలో ఒకరు రెండేళ్లుగా బోనస్ రావడం లేదంటున్నారని, అసలు తాము అధికారంలోకి వచ్చే ఇంకా రెండు సంవత్సరాలు కాలేదని విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇలా తప్పుడు సమాచారంతో ముందుకు పోతే జూబ్లిహిల్స్ తీర్పు రిపీట్ అవుతుందన్నారు.



