ఆంధ్ర ప్రదేశ్

ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

నంద్యాల-ఆళ్లగడ్డ హైవేలోని నల్లగట్ల గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బైక్‌ను వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలు తీవ్ర గాయాలయ్యాయి.

మృతుడు బత్తలూరుకు చెందిన కుమార్‌గా గుర్తించారు. గాయపడిన నరసింహను చికిత్స కోసం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని చూసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,మాధురి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button