సినిమా

దీపికాపై రానా సెటైర్?

Rana Daggubati: సినీ పరిశ్రమలో పని గంటల గురించి మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. దీపికా పదుకొనె వ్యాఖ్యల తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి స్పందన నెట్టింటా వైరల్ అవుతుంది. దీపికపై సెటైర్ వేస్తూ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

సినీ రంగంలో పని గంటల పరిమితి అంశం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. దీపికా పదుకొనె ‘8 గంటలే పని’ అన్న వ్యాఖ్యలు ఈ చర్చకు బీజం వేశాయి. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. “ఇదేం ఉద్యోగం కాదు, నటన అంటే ఒక జీవనశైలి.

ఇది ప్యాషన్. 8 గంటలు కూర్చుంటే అద్భుతం జరగదు” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. మంచి సినిమా కోసం నటీనటులు పూర్తిగా అంకితభావంతో ఇన్వాల్వ్ అవ్వాల్సిందేనని, గంటలకు లిమిట్ పెట్టడం అసాధ్యమని రానా అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button