తెలంగాణ
నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్.. ఇష్టారాజ్యంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ అమ్మకం

Private schools: కొత్తగూడెం జిల్లా మణుగూరులో శ్రీచైతన్య స్కూల్ యాజమాన్యం ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్‌ను అమ్ముతు న్నారు. అంతేకాదు ఏ స్కూల్లో చదివే విద్యార్థులు అదే పాఠశాలలో, బుక్స్, బ్యాగ్స్ కొనాలంటూ పేరెంట్స్‌కు హుకూం జారీ చేశారు. ఇప్పటికే శ్రీచైతన్య స్కూల్‌పై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి శ్రీచైతన్య స్కూల్ యాజమాన్య అరాచకాలపై యాక్షన్ తీసుకునే వారే లేరా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.