News
Chandrababu: సీఎం రేవంత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

Chandrababu: సీఎం రేవంత్‌రెడ్డికి….ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కోరినట్టు టీటీడీ దర్శనాల కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.. సోమవారం నుంచి గురువారం వరకు రెండు బ్రేక్ దర్శనం కోసం, రెండు ప్రత్యేక దర్శనం కోసం సిఫార్సు లేఖలను అనుమతి ఇస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.