తెలంగాణ
హైదరాబాద్లో రికార్డు స్థాయి డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు

హైదరాబాద్లో డ్రంకన్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసులు నమోదు చేశశారు. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారే వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసిన మందుబాబులు లెక్క చేయలేదు. డ్రంకన్ డ్రైవ్ చేసిన వాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.



