తెలంగాణ
Hyderabad: గొంతు నులిమి తండ్రిని హత్య చేసిన కొడుకు

హైదరాబాద్ కుషాయిగూడ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సాయినగర్ కాలనీలో తండ్రి శంకర్‌ను గొంతు నులిమి కొడుకు హతమార్చాడు. శంకర్‌ను హత్యకు మరో ఇద్దరు సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడు జగదీష్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.