ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రాజధాని అమరావతికి మరో లోన్ మంజూరు

ఏపీ రాజధాని అమరావతికి మరో లోన్ మంజూరైంది. సీఆర్డీఏకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైవలప్‌మెంట్ సంస్థ 7 వేల 500 కోట్లు మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు NaBFID మంజూరు పత్రం అందజేసింది. ఇప్పటికే 26వేల కోట్ల మేర సీఆర్డీఏ రుణం తీసుకుంది. సీఆర్డీఏకు నిధులు సమకూర్చేందుకు అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు ముందు వస్తున్నాయి.



