తెలంగాణ
రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో యాత్ర

రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపట్టింది. మూడు రోజుల పాటు యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. వికారాబాద్ కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్‌కు బీజేపీ నేతలు వెళ్లారు. రైతులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.



