జాతియం

కరూర్ తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం స్టాలిన్

కరూర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డవారిని సీఎం స్టాలిన్ పరామర్శించారు. ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయనని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. బాధితులకు సాయమందించడమే మా ముందున్న కర్తవ్యమన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలుంటాయని తెలిపారు. విజయ్‌ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు మాట్లాడనన్నారు.

మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం స్టాలిన్ నష్టపరిహారం ప్రకటించారు. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయలు పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button